కోనసీమ అందాలకు పొగ మంచు తోడైతే...!
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయం పొగమంచు కనువిందు చేసింది. ప్రభాత సూర్యుడి లేలేత కిరణాలు... నీటి బిందువులను తాకి.. మంచి ముత్యాల్లా మెరిసిపోయాయి. పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమకు పాల మీగడ వంటి మంచు జతకట్టిన దృశ్యాలు మనసుని హత్తుకుంటున్నాయి.