పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనకు కాకుండా... శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలో ఎవరికి పీసీసీ ఇచ్చినా కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా... పార్టీని పటిష్ఠం చేసేలా ముగ్గురం కలిసి పని చేస్తామని కోమటిరెడ్డి వివరించారు.
రేవంత్, శ్రీధర్ ఎవరైనా ఓకే.. పోటీలో మాత్రం నేనున్నా: కోమటిరెడ్డి - tpcc chief post updates
టీపీపీసీ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయగా... ఇప్పడు ఆ స్థానానికి ఎవరు అర్హులనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తానూ రేసులో ఉన్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. పదవి ఎవ్వరికిచ్చినా... పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
komatireddy venkat reddy announced he is also in tpcc race
టీపీసీసీ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయగా... ఇప్పుడు ఆ స్థానం ఎవరికి దక్కనుందన్న అంశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిణామాల్లో పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి పీసీసీ పదవి ఇచ్చి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఎన్నికలుంటేనే.. సర్కారుకు రైతుబంధు గుర్తొస్తుంది: జీవన్ రెడ్డి
Last Updated : Dec 5, 2020, 10:33 PM IST