టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అప్పుడప్పుడు హంగామా చేస్తుండటం అందరికీ తెలుసు. పలు సందర్భాల్లో తన ఎమోషన్స్ ప్రదర్శించి అభిమానులకు ఉత్సాహం నింపుతుంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ చేసిన డ్యాన్స్ అందరినీ అబ్బురపరిచింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్ 69 పరుగులు, రోహిత్ శర్మ 74 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన మరో ఇద్దరూ రెచ్చిపోయారు. ఫలితంగా అఫ్గాన్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్.