రాష్ట్రంలో మద్యపానాన్ని నియంత్రించాలని, ప్రభుత్వ మద్యం పాలసీని ప్రకటించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, మహిళా జనసమితి ఆధ్వర్యంలో 'తెలంగాణ ప్రభుత్వ మద్యం పాలసీ-ప్రజాజీవనంపై ప్రభావం'అనే అంశంపై కార్యశాల నిర్వహించారు.
అఘాయిత్యాలకు కారణం..
ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఆధారపడుతోందని కోదండరాం అన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తు రుసుం కింద రూ.2 లక్షలు వసూలుచేశారని.. దీని మూలంగానే రూ.900 కోట్లు సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవే మహిళలపై దాడులకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు పెరిగాయని.. యువతపై అధిక ప్రభావం చూపుతోందని తెలిపారు.
ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటించాలి: కోదండరాం ఇవీచూడండి: పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...