జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవని స్పష్టం చేశారు.
'గుడివాడలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవు' - clash between kodali nani, pawan kalyan
ఏపీలోని గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు నిర్వహించడం లేదని ఆ రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ విమర్శలను తోసి పుచ్చిన నాని.. బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పేందుకే స్పందించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

'గుడివాడలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవు'
వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేకాట క్లబ్బులను మూయిస్తుందే తప్ప ప్రోత్సహించటం లేదని కొడాలి స్పష్టం చేశారు. మంత్రిగా, ప్రజలకు, ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు తాను సమాధానం చెప్తానే తప్ప.. ఎవరో చేసిన ఆరోపణలు పట్టించుకోనని అన్నారు.
'గుడివాడలో ఎక్కడా పేకాట క్లబ్బులు లేవు'