తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలి: కిషన్‌రెడ్డి - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వార్తలు
20:45 August 26
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలి: కిషన్‌రెడ్డి
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలని ఆయనను కోరారు. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
హైకోర్టులో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 వరకు పెంచాలని కోరుతూ లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'