సమాజంలో ప్రతి ఒక్కరు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని డి.వి కాలనీలో గ్రేటర్ హైదరాబాద్ ఐరన్ అండ్ స్టీల్ మర్చంట్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సమాజంలో ఎవరికైనా కష్టం వచ్చినా వెంటనే స్పందించాలని భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దాదాపు 400 మందికి పైగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన వెల్లడించారు. మానవ శరీరంలో రక్తం అనేది ఎంతో ముఖ్యమైందని.. డబ్బులతో తయారు చేయలేమని అన్నారు. రక్తదానం చేసిన వారు మరొకరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించినవారవుతారని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మిషిన్లతో, డబ్బుతో రక్తం తయారు కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - minister kishan reddy programme at hyderabad
సికింద్రాబాద్ డి.వి.కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణం కల్పించిన వారవుతారని ఆయన తెలిపారు.
రక్తం మిషిన్లతో, డబ్బుతో తయారు కాదు: కిషన్ రెడ్డి