తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోంది: అన్వేష్ రెడ్డి - ప్రభుత్వంపై అన్వేష్ రెడ్డి ఆరోపణలు

రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్​ అన్వేష్ రెడ్డి విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటలు వెంటనే అంచానా వేసి... పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

kisan congress telangana chairmen anvesh reddy fore on goverment
ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోంది: అన్వేష్ రెడ్డి

By

Published : Oct 17, 2020, 7:33 PM IST

ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని కిసాన్​ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్​ అన్వేష్ రెడ్డి విమర్శించారు. వ్యతిరేకిస్తున్న రైతులను స్థానిక ఎమ్మెల్యే... పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. నిలదీసిన 40 మంది రైతలపై నాన్ బెయిలబులు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు... చేతికొచ్చిన పంట నష్టపోయిందని అన్వేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైఫరీత్యాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పంటనష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. వరి రైతుకు ఇచ్చిన తూకం పట్టి ఆధారంగానే వెంటనే డబ్బులు చెల్లించాలని కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రం ఎటెళుతోంది... అసలేం జరుగుతోంది: భట్టి

ABOUT THE AUTHOR

...view details