తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు: కిసాన్​ కాంగ్రెస్​ - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో రైతు రుణమాఫీ కోసం కేవలం రూ.5,225 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఎలా సరిపోతుందని కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. రైతుల గురించిన ఎందుకు ఆలోచించడం లేదో చెప్పాలన్నారు.

kisan congress
రైతుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు: కిసాన్​ కాంగ్రెస్​

By

Published : Mar 23, 2021, 10:37 PM IST

ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైతుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల పీఆర్సీ నిర్ణయిస్తున్నారని.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న వ్యవసాయంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. ఏటా పెరుగుతున్న విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలు, ట్రాక్టర్ కిరాయిల ఆధారంగా రైతు పండించిన పంటలకు ధర ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు.

రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అమలు చేయకపోవడం వల్ల రైతుల మీద పడుతున్న వడ్డీ భారం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ కోసం కేవలం రూ.5,225 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తే ఎలా సరిపోతుందన్నారు. సూక్ష్మ సేద్యం కోసం గతేడాది రూ.218.41 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు.

ఇవీచూడండి:అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సీఎం ప్రకటించారు: హరీశ్‌

ABOUT THE AUTHOR

...view details