రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ ఎంపీ మధుయాస్కీ తెలిపారు. రైతులకు మద్దతు ధర రాకుండా కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు' - గాంధీ భవన్లో కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమం
హైదరాబాద్ గాంధీభవన్‌లో కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాస్కీ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా ఖండించారు.
!['రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు' 'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9377459-773-9377459-1604131982254.jpg)
'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు'
అంతకు ముందు నెక్లెస్‌రోడ్‌లోని నాయకుల విగ్రహాలకు పూలమాలవేసి నివాళుర్పించారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మధుయాస్కీ పేర్కొన్నారు. ప్రాజెక్టుల కమీషన్లతో వేలాది కోట్లు గడిస్తూ సీఎం కేసీఆర్... రైతులను గాలికొదిలేశారని ఆరోపించారు. అఖరికి హైదరాబాద్ వరద బాధితుల పరిహారం సైతం నొక్కేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో రైతులు కాంగ్రెస్ పక్షాన నిలిచి తెరాస, భాజపాకు బుద్ధి చెప్పాలని కోరారు.