ఏపీ విశాఖ జిల్లా అరకులోయ వరకు ప్రయాణించే కిరండూల్ రైలుకు ఈనెల 18 నుంచి మళ్లీ అద్దాల బోగీని పునరుద్ధరించనున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా బోగీని తొలగించామని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా పునరుద్ధరించున్నట్లు వివరించారు.
అరకు అందాలు వీక్షించేందుకు... అద్దాల బోగీ మళ్లీ సిద్ధం - అరకు అద్దాల బోగీ పునరుద్ధరణ
ఏపీ విశాఖ జిల్లాలో సాధారణంగా డిసెంబరు-జనవరి నెలల్లో అరకు అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఆ అందాల నడుమ కిరండూల్ పాసింజర్ అద్దాల బోగీ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని పంచుతుంది. మహమ్మారి కారణంగా దాన్ని తొలగించారు. అయితే ఈనెల 18 నుంచి మళ్లీ అద్దాల బోగీని పునరుద్ధరించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అరకు సొరంగ మార్గాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అందమైన జలపాతాలను అద్దాల బోగీలో నుంచి వీక్షిస్తూ ప్రయాణం చేయాలని పర్యటకులను ఆహ్వానిస్తున్నారు.
అరకు అందాలు వీక్షీంచేందుకు... అద్దాల బోగీ మళ్లీ సిద్ధం
స్లీపర్ కోచ్, హాల్ట్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఎస్.కోట, బొర్రా గుహల్లో రైలును నిలుపుతామని పేర్కొన్నారు. పర్యటకులు కరోనా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.