తెలంగాణ

telangana

ETV Bharat / city

Araku Valley: ఈనెల 15 నుంచి కిరండోల్‌ రైలు ప్రారంభం - Araku Valley trains updates

అరకులోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో .. రైల్వేశాఖ వారి కోసం ఓ నిర్ణయం తీసుకుంది. అరకులోయ అందాలను వీక్షించేలా.. ఆ మార్గంలో కిరండోల్‌ రైలు సేవలను మళ్లీ ప్రారంభించింది. 15వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈనెల 15 నుంచి కిరండోల్‌ రైలు ప్రారంభం
ఈనెల 15 నుంచి కిరండోల్‌ రైలు ప్రారంభం

By

Published : Jul 10, 2021, 12:48 PM IST

రైలు ప్రయాణంలో అరకులోయ అందాలను తిలకించాలని భావించే పర్యాటకులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. విశాఖపట్నం-కిరండోల్‌ ప్రత్యేక రైలును ఈ నెల 15 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన అనంతరం ఇటీవలే ప్రారంభమైన ఈ రైలును రద్దీ లేని కారణంగా అధికారులు రద్దు చేశారు.

ప్రస్తుతం అరకులోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈనెల 15 నుంచి విశాఖపట్నం-కిరండోల్‌ (08516), 16 నుంచి కిరండోల్‌-విశాఖపట్నం (08515) ప్రత్యేక రైళ్లను తిరిగి పట్టాలెక్కిస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తి నిలిపివేసిన జెన్‌కో

ABOUT THE AUTHOR

...view details