వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షల కోసం వినియోగించే కియోస్క్ మిషన్‌ను రంగారెడ్డి జిల్లా వైద్య శాఖకు అందజేశారు. ఈ మిషన్‌ను హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
వైద్యుల సేవలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ మహేశ్ భగవత్ - రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిశాఖ తాజా వార్తలు
కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్ష సెంటర్‌లో కియోస్క్ మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్యుల సేవలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి చేతుల మీదగా ప్రారంభించారు. ఈ మిషన్ సహాయంతో నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు సులువు అవుతుందని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి:ఎలా కట్టడి చేద్దాం... సీఎస్ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం