King Cobra: స్నానానికి బాత్ రూంలోకి వెళ్లగానే..సీన్ చూసి షాక్! దట్టమైన అడవుల్లో కనిపించే అత్యంత విషపూరితమైన గిరినాగు పాము (King Cobra) ఏపీ విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మారేపల్లిలోని ఓ ఇంట్లో కనిపించింది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఏకంగా ఇంట్లోకి దూరింది. బాత్రూంలోకి ప్రవేశించిన ఆ భారీ పాముని చూసి ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా భయపడి పరుగులు పెట్టారు. ఊరు మొత్తం అక్కడికి చేరుకున్నా.. ఏమీ చేయలేకపోయారు.
ఈ సంగతి తెలుసుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వారు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు కూడా అంత సులువుగా ఆ పామును పట్టుకోలేకపోయారు. దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి ఎంతో చాకచక్యంగా.. గిరినాగు పామును పట్టుకున్నారు.
దీని పొడవు దాదాపుగా 13 అడుగులకు పైగా ఉంది. ఈ భారీ గిరినాగును సజీవంగా పట్టుకొన్న వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులు.. ఆ సర్పాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇవి ఎక్కువగా దేశంలోని తూర్పు కనుమల్లో, ఆగ్నేయ ఆసియా దేశాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులు.
ఇవి ఆహారంగా పాములను మాత్రమే తింటాయని చెప్పారు. ఈ భారీనాగు ఏడాదిలో 350 వరకు పాములను వేటాడి తినగలుగుతుందన్నారు. ఈ రకం పాముల వలన ఉపయోగమేనని తెలిపారు. గిరినాగు పాము చాలా అరుదైన జాతి అని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. గిరినాగు దాని ప్రాణ రక్షణ కోసం పడగ విప్పి.. నాలుగు అడుగులకు పైగా ఎత్తుకు ఎగురుతుందని తెలిపారు.
ఇదీచూడండి:KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఏమన్నారంటే...