తెలంగాణ

telangana

ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు - coronavirus news

పోలీసుల, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిది. మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. కొంతమంది మాత్రం ఏమీ పట్టనట్టూ రోడ్లెక్కి తిరుగుతున్నారు. కానీ వారి సేవలను గుర్తించిన చిన్నారులు పారిశుద్ధ్య మహిళ కాళ్లు కడిగి పాదాలకు నమస్కరించారు.

gvmc workers
gvmc workers

By

Published : Apr 4, 2020, 5:26 PM IST

విశాఖలో ఇవాళ ఉదయం జీవీఎంసీలోని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు లాక్​డౌన్​ ఉన్నా కొంతమంది నిబంధనలు పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. మీ కోసమే మేం కష్టపడేది అనుకుంటూ ఆమె రోడ్డుపై చెత్తను శుభ్రం చేస్తూ ఓ ఇంటి ముందుకొచ్చింది. ఆమె చేస్తున్న పనిని గమనించిన ఇద్దరు చిన్నారులు.. మహిళను ఇంటికి తీసుకెళ్లారు.

కరోనా వైరస్ విజృంభణలో సైతం.. తమ కోసం కష్టపడుతున్న ఆమె కాళ్లు కడిగి.. పసుపు రాసి ఆమె పాదాలకు నమస్కరించారు. అనంతరం చీర, జాకెట్టు, తాంబూలం ఇచ్చి సత్కరించారు. నిబంధనలను పట్టించుకోకుండా తిరిగే పెద్దల కంటే పెద్ద మనసున్న ఈ చిన్నారులు చేసిన పని.. ఎంతో గొప్పది కదూ..!

పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు

ఇదీ చదవండి:భారత్​ బయోటెక్​కు మంత్రి కేటీఆర్​ అభినందనలు

ABOUT THE AUTHOR

...view details