Paddy Procurement Telangana : కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక మండలాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో.. రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర, ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని మండలాల్లో కొనుగోళ్లు పూర్తయి కేంద్రాల్ని మూసివేస్తే, మరికొన్ని మండలాల్లో కేంద్రాలు ప్రారంభించినా ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలవని పరిస్థితి ఉంది.
మరో 40 లక్షల టన్నులు..
Kharif Paddy Procurement Telangana : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల ద్వారా 49.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. కొనుగోలు చేయాల్సిన ధాన్యం మరో 40 లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు, పొలాల వద్ద క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించగా రైతుల దయనీయ స్థితి కళ్లకు కట్టింది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద భారీగా ధాన్యం ఉంది. పొలాలు, కల్లాల్లో పెద్దమొత్తంలో నిల్వ చేసిన రైతులు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో రోజుకు ఇద్దరు, ముగ్గురికే టోకెన్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చి ఆరు వారాలైనా కొనేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతుల వారీగా కాపలా..
Kharif Paddy Procurement : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర జిల్లా రామచంద్రుతండా కొనుగోలు కేంద్రానికి 70 మంది రైతులు ధాన్యం తెచ్చారు. వంతులవారీగా కాపలా ఉంటున్నారు. నల్గొండ జిల్లా మల్లేపల్లి, చందంపేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొండ మల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి, పేర్వాల తదితర కొనుగోలు కేంద్రాల్లో పెద్దసంఖ్యలో రైతులు పడిగాపులు కాస్తున్నారు.
ఓపిక నశించింది..
Paddy Procurement Telangana 2021 : మల్లేపల్లి మండలం చింతకుంటకు చెందిన గోవింద్ అనే రైతుకు ఎకరంన్నర పొలం ఉంది. ‘ఈసారి 8 పుట్ల పంట పండింది. నవంబరు 9న ధాన్యం తెచ్చాం. రేపు, ఎల్లుండి అంటున్నరు. ఇప్పటిదాకా కొనలేదు. ఇంకా ఎన్నిరోజులు కొనుగోలు కేంద్రంలో పడుకోవాలి? నాతోపాటు చాలామంది రైతులు ఇక్కడ వడ్ల కుప్పల దగ్గర ఉంటున్నరు. మా ఓపిక అయిపోయింది. రోడ్లపై ఆందోళన చేస్తాం.’ అంటున్నారాయన. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఇలాంటి రైతుల అగచాట్లే దర్శనమిస్తున్నాయి.
రోజుకు అయిదుగురికే టోకెన్లు