తెలంగాణ

telangana

ETV Bharat / city

Suicide attempt: మేడ పైనుంచి దూకబోయిన కరోనా రోగి.. - విశాఖ కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం వార్తలు

ఏపీలోని విశాఖ కేజీహెచ్ మేడ పైనుంచి ఓ కరోనా బాధితురాలు దూకేందుకు యత్నించింది. వెంటనే స్పందించిన సిబ్బంది బాధితురాలిని కాపాడారు. తనను ఇంటికి పంపించాలని బాధితురాలు వైద్యులను కోరగా.. ఆమె కోలుకోకపోవటం వల్ల వైద్యులు పంపించలేదు. చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి కింద దూకబోయింది. ఇప్పటికే ఈ బ్లాక్‌లో మేడ పైనుంచి దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

vishakha kgh women suicide
vishakha kgh women suicide

By

Published : Jun 4, 2021, 6:47 PM IST

మేడ పైనుంచి దూకబోయిన కరోనా రోగి.. కాపాడిన సిబ్బంది

ఏపీలోని విశాఖ కేజీహెచ్​లో సీఎస్​ఆర్ బ్లాక్ పైనుంచి దూకబోయిన కొవిడ్ బాధితురాలిని..వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది.. తక్షణమే స్పందించి కాపాడారు. కొద్దిరోజులుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉండటంతో...ఇంటికి తరలించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. సమీపంలో ఉన్న మరో కొవిడ్ బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను అడ్డుకున్నారు.

ఇప్పటికే ఈ బ్లాక్‌లో నలుగురు బాధితులు మేడ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది వెల్లడి చేయలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం తెలిసింది.

ఇదీ చదవండి:తల్లి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదని ఓ కూతురి ఘాతుకం

ABOUT THE AUTHOR

...view details