KGF Movie Team: కేజీఎఫ్ చిత్ర బృందం ఏపీలోని విశాఖలో సందడి చేసింది. కేజీఎఫ్ పార్ట్-2 చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన బృందం నగరంలోని ఓ హోటల్లో మీడియాతో ముచ్చటించారు. కేజీఎఫ్ పార్ట్ -1 చిత్రం పట్ల అత్యంత ఆదరణ చూపించిన తెలుగు ప్రేక్షకులకు హీరో యశ్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఘనవిజయం సాధించడానికి సినిమా బృందం ఎంతో కష్టపడిందని ఆయన అన్నారు.
"దర్శకులు చెప్పిన కథలు నచ్చితే, ఆ క్యారెక్టర్‌కు నేను సరిపోతానని భావిస్తే తప్పకుండా మరిన్ని చిత్రాలు చేస్తాను. విశాఖ నగరం చాలా బాగుంది. మొదటిసారి సాగరతీరాన్ని సందర్శించాను. భవిష్యత్తులో నా షూటింగులు ఇక్కడ చేసేలా ప్రయత్నిస్తా" - యశ్, కేజీఎఫ్ హీరో