తెలంగాణ

telangana

ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది:కేకే

దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారని ఎంపీ కేశవరావు అన్నారు. మార్కెట్‌ సరళీకరణ విధానాలు తీసుకువచ్చారని, అసమాన ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనత చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. పీవీ ఆశయాలు, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు.

By

Published : Jun 28, 2020, 11:36 AM IST

Published : Jun 28, 2020, 11:36 AM IST

Updated : Jun 28, 2020, 11:49 AM IST

kesava-rao-said-pv-narasimha-rao-achievements-as-a-scientist-goes-down-in-history
'ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది'

సీఎంగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు భూసంస్కరణలు అమలు చేశారని ఎంపీ కేశవరావు అన్నారు. నవోదయ విద్యాలయాలను తీసుకువచ్చిన ఘనత పీవీదే అని కొనియాడారు. పేదలకు సమాజంలో గౌరవం, ఆత్మగౌరవం తీసుకువచ్చారని అన్నారు.

ఆర్థిక సుస్థిరతకు ఆయన అందించిన నాయకత్వం సదా స్మరణీయంమని పేర్కొన్నారు. బీసీల్లో రాజకీయ చైతన్యం, సాధికారత తెచ్చారని వివరించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని నివాళులర్పించి, ప్రసంగించారు.

ప్రజ్ఞాశీలిగా పీవీ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది:కేకే

ఇదీ చూడండి :పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

Last Updated : Jun 28, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details