Kerala Invites Kavitha: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేరళ అసెంబ్లీ నిర్వహించనున్న జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈనెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 26న "నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం" అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. అదే అంశంపై ఎమ్మెల్సీ కవితతో పాటు.. ఉత్తరాఖండ్ గవర్నర్ రీటా ఖండూరీ, అన్నీ రాజా సైతం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
ఇవీ చదవండి:మోదీ హైదరాబాద్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు.. వారిపై ముందస్తు చర్యలు