తనను కాదన్నాడనే అక్కసుతో ఓ వ్యక్తిపై యాసిడ్ దాడికి(acid attack kerala) దిగిందో మహిళ. కేరళలో జరిగిన ఈ దారుణ ఘటనలో బాధిత వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు.
ఫేస్బుక్లో మూడేళ్లు..
తిరువనంతపురంలో నర్సుగా పనిచేస్తున్న 36ఏళ్ల షీబాకు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా అరుణ్ కుమార్‌తో పరిచయమైంది. కొన్నాళ్ల స్నేహం అనంతరం షీబాకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్న అరుణ్ ఆమెతో విడిపోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇతర మహిళలతో చనువుగా ఉంటున్నాడు. ఇది తెలిసి షీబా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో కొన్నాళ్లుగా ఇద్దరూ సరిగా మాట్లాడుకోవట్లేదు.
ఈ క్రమంలోనే అరుణ్‌ని ఆదిమలిలోని ఓ చర్చికి రావాల్సిందిగా కోరింది. మాట్లాడుతుండగానే.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అరుణ్ ముఖంపై పోసింది (acid attack latest news). ఆ సమయంలో తన ముఖంపైనా యాసిడ్ పడటంతో గాయాలపాలైంది.