దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉపసభాపతి పద్మారావుగౌడ్, తెరాస ప్రధాన కార్యదర్శులతో సీఎం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమికి కారణాలపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ వ్యతిరేక ఫలితం రావడానికి గల కారణాలను బేరీజువేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై మంత్రులు, నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్ భేటీ
13:12 November 12
మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్ భేటీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ, పార్టీ పరిస్థితిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ విషయమై ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని అంశాలు, సమస్యలకు సంబంధించి తీసుకోవాల్సి నిర్ణయాలపైనా సీఎం చర్చించనున్నారు.
ఇవీచూడండి:బల్దియా పోరుకు సిద్ధమైన పార్టీలు.. మారనున్న వ్యూహాలు