KCR Meeting with Akhilesh Yadav : జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్ నివాసంలో రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
KCR Delhi Tour Updates : ఈ సాయంత్రం.. దిల్లీలోని మొహల్లా క్లినిక్‌ను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్‌తో కలిసి క్లినిక్ సందర్శిస్తారు. ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్లనున్న కేసీఆర్.. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.