మేడారం మహాజాతరలో రెండో రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మిమ్ములను చల్లగా చూస్తానని అభయమిస్తూ... సమ్మక్క తల్లి... చిరునవ్వులు చిందిస్తూ... గద్దెపైన కొలువుదీరింది. ఒకేసారి... నలుగురు వనదేవతలు గద్దెపైనే ఉడటంతో... భక్తుల కోలాహలం మిన్నంటింది. తల్లులారా మీకే వందనమంటూ... తనివితీరా దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకు ముందు... చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క ఆగమనం ఆద్యంతం... వైభవంగా సాగింది. కొమ్ము, నృత్యాలు, డప్పు శబ్ధాలు... డోలు వాద్యాల మధ్య సమ్మక్కను ఆదివాసీ పూజారులు గుట్ట దిగువకు తీసుకొచ్చారు. దారి పొడవునా....భక్తులు తండపోతండాలుగా చేరి... తల్లికి నీరాజనాలు పలికారు. అందమైన రంగవల్లులద్ది... అమ్మకు ఆహ్వానం పలికారు.