నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ నేపథ్యంలో అధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బోర్డు భేటీలో ప్రస్థావించాల్సిన విషయాలు, ఎజెండా రూపకల్పనపై చర్చిస్తున్నారు.
నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - kcr reviwe on water
16:11 June 01
నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
నాలుగున బోర్డు భేటీ..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల నాలుగో తేదీన సమావేశం కానుంది. కొత్త ఎత్తిపోతలను ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన తరుణంలో తెలంగాణ, ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. సమస్యల పరిష్కారానికి బోర్డు 12వ సమావేశాన్ని జూన్ నాలుగో తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. బోర్డు సమావేశం కోసం ఎజెండా అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే కోరారు. ప్రాజెక్టుల డీపీఆర్ లు, టెలిమేట్రీ ఏర్పాటు, బోర్డు బడ్జెట్ సంబంధిత అంశాలపై చర్చించాలని బోర్డు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి:ఉత్తమ్‌పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి