పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు తెలిపారు. అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో మరోసారి నిలిచిందన్నారు. రాకెట్ ప్రయోగాల కోసం పలు దేశాలు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇస్రో ద్వారా దేశ ఖ్యాతి వర్ధిల్లుతోందని పేర్కొన్నారు.
'పీఎస్‌ఎల్‌వీ-సీ51' విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం - తెలంగాణ తాజా వార్తలు
పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతంకావడంపై శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇస్రో ద్వారా దేశ ఖ్యాతి వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ మిషన్ పేరుతో పాటు.. భగవద్గీత కాపీ, 25,000 మంది పేర్లను ఇస్రో పంపింది.
!['పీఎస్‌ఎల్‌వీ-సీ51' విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం kcr praises isro scientists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10813333-329-10813333-1614509656384.jpg)
ఏపీలోని శ్రీహరికోట వేదికగా 10.24 నిమిషాలకు.. పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్.. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో నుంచి మొదటిసారిగా నేడు దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను నింగిలోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ మిషన్ పేరుతో పాటు.. భగవద్గీత కాపీ, 25,000 మంది పేర్లను ఇస్రో పంపింది. ఇందులో వెయ్యిమంది విదేశీయుల పేర్లు కాగా.. మిగిలిన 24 వేల పేర్లు చెన్నై విద్యార్థులవి కావడం విశేషం.