మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు తేలిగ్గా తీసుకోవద్దని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో తెరాస విస్తృత స్థాయి సమావేశంలో.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, ముఖ్య నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తమ నియోజకవర్గంలోని అభ్యర్థులను గెలిపించుకోకపోతే... మంత్రులకు పదవులు ఉండవని సీఎం వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు, ప్రచార వ్యూహాల ఖరారు బాధ్యతలన్నీ స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.
అందరూ కలిసి సమన్వయంతో పనిచేయండి: కేసీఆర్
టికెట్ ఎవరికి వచ్చినా అందరూ పనిచేయాల్సిందేనని తెలిపారు. ఎక్కడైనా అంతర్గత విబేధాలు కనిపిస్తే సహించేది లేదని... వాటిని సర్దుబాట్లు చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులదేనన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.
అతివిశ్వాసంతో వెళ్లకండి: కేసీఆర్