తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇరురాష్ట్రాల అధికారుల మధ్య కొనసాగుతున్న సమావేశం

By

Published : Jun 28, 2019, 11:29 AM IST

Updated : Jun 28, 2019, 5:52 PM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/28-June-2019/3686054_kcr.jpg

2019-06-28 17:21:19

ఇరురాష్ట్రాల మంత్రుల మీడియా సమావేశం...

  • ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు జరిగాయి: మంత్రి ఈటల 
  • చిన్నచిన్న సమస్యలతో పాటు సాగునీటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది: మంత్రి ఈటల 
  • సరిపడా సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి: మంత్రి ఈటల
  • ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది: మంత్రి ఈటల
  • ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణలు లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనేది మా విధానం: మంత్రి ఈటల
  • ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు:మంత్రి ఈటల
  • ఇవాళ్టి సమావేశం కొనసాగింపుగా రేపు ఉన్నతాధికారులు సమావేశం అవుతారు;మంత్రి ఈటల
  •  దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలనేది మా ఆశయం;మంత్రి ఈటల 
  • ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  • రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలు వినియోగించుకోవడంపై ప్రధాన చర్చ జరిగింది: ఏపీ మంత్రి బుగ్గన
  • ఏయే ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనే విషయంపై ఇరువురు సీఎంలకు మంచి అవగాహన ఉంది: ఏపీ మంత్రి బుగ్గన
  • నీటి సమస్య పరిష్కారానికి సూచనలు, వ్యూహాలు ఇవ్వాలని అధికారులు, ఇంజినీర్లకు చెప్పారు: ఏపీ మంత్రి బుగ్గన
  • రెండు రాష్ట్రాలు జల వివాదాలు పరిష్కరించుకుని దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాం: ఏపీ మంత్రి బుగ్గన
  • కోర్టుకు, ట్రైబ్యునళ్లకు వెళ్లినా.. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు: ఏపీ మంత్రి బుగ్గన
  • సామరస్యంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకుందామనే భావన ఇరువురు సీఎంలలో ఉంది: ఏపీ మంత్రి బుగ్గన
  • అభివృద్ధి కోసం సోదరులుగా కలిసి ప్రయాణం చేద్దామని ఇరువురు సీఎంలు నిర్ణయించుకున్నారు: ఏపీ మంత్రి బుగ్గన
  • నదీజలాల వినియోగానికి సంబంధించి జులై 15లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరారు: ఏపీ మంత్రి బుగ్గన
  • గోదావరి జలాలను గరిష్ఠంగా వాడుకోవడంపై దృష్టి సారించారు: ఏపీ మంత్రి బుగ్గన
  • రెండు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకోవల్సిన అంశాలపై అధికారులు ఇంకా చర్చలు చేస్తున్నారు: ఏపీ మంత్రి బుగ్గన
  • ఏపీకి చెందిన భవనాలు హైదరాబాద్‌లో నిరుపయోగంలో ఉన్నాయి : ఏపీ మంత్రి బుగ్గన
  • వాడుకోలేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం కారణాలతోనే ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగించాం: ఏపీ మంత్రి బుగ్గన

2019-06-28 17:11:33

జలాల తరలింపు అంశంపై కమిటీ ఏర్పాటు...
గోదావరి నుంచి కృష్ణాకు జలాల తరలింపు అంశంపై  ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయమై నివేదిక ఇవ్వనున్న కమిటీ. విభజన అంశాలపై రేపు ఇరు రాష్ట్రాల అధికారుల ప్రత్యేక సమావేశం కానున్నారు. 

 

2019-06-28 16:52:05

ప్రగతిభవన్‌లో ముగిసిన కేసీఆర్‌, జగన్‌ల సమావేశం 

    ప్రగతిభవన్​లో కేసీఆర్‌, జగన్ సమావేశం ముగిసింది. సుమారు ఐదు గంటల పాటు సాగిన సమావేశంలో గోదావరి నీటి తరలింపుతో పాటు పలు కీలక అంశాలపై చర్చింటినట్లు సమాచారం. కాసేపట్లో ప్రగతిభవన్‌లో ఇరురాష్ట్రాల మంత్రుల మీడియా సమావేశం. 
 

2019-06-28 16:12:56

'ట్రైబ్యునల్​, కోర్టుల  చుట్టూ తిరిగితే లాభం ఉండదు'
నీళ్ల కోసం ట్రైబ్యునల్‌, కోర్టుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోందని...మన అవసరాలు తీరాకే కేంద్ర ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

 

2019-06-28 15:59:25

సీఎం కేసీఆర్​ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
అందుబాటులో ఉన్న జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఏపీలోని రాయలసీమతో పాటు తెలంగాణలోని నల్గొండ, పాలమూరు జిల్లాకు నీరందించాలని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. తక్కువ వర్షాలు పడినా.. ఏటా 3000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని సీఎం కేసీఆర్ వివరించారు.  ఆ నీటిని మళ్లించి శ్రీశైలంకు తరలించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. అందుబాటులోని నీళ్లతో రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ద్వారా సూచించారు.  

 

2019-06-28 15:32:18


తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలన్న ఇద్దరు సీఎంలు...


తెలంగాణ, ఏపీ రెండు వేర్వేరు అనే భావన తమకు లేదన్నారు ఇరువురు సీఎంలు కేసీఆర్​, జగన్మోహన్​ రెడ్డి. నదీ జలాల వివాదాలను ఏకాభిప్రాయంతో త్వరగా పరిష్కరించుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువున్నందున గోదావరి నీటిని తరలించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలంలోకి తరలించే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎంల ఆదేశం.
 

2019-06-28 15:17:01

ఇరువురి అభిప్రాయం ఒక్కటే

నదీజలాలను వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఉదయం 11.30కు ప్రగతి భవన్​ వేదికగా ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. గోదావరి జలాల సద్వినియోగంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సమావేశం ప్రారంభంలో ఇద్దరు సీఎంలు భేటీని ఉద్దేశించి మాట్లాడారు. ఇద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాదాల వల్ల ఒరిగేది ఏమి లేదని... కోర్టులు, ట్రైబ్యునల్ చుట్టూ తిరుగడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని... అనుభవాలు ఇవే చెబుతున్నాయని ఇరువురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. 

2019-06-28 14:31:04

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

రేపు కూడా సమావేశం

ప్రగతిభవన్​లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డులను రద్దుచేయమని కేంద్రానికి సిఫారసు చేయడంపై సీఎంలు సమాలోచనలు జరపుతున్నారు. నీటివినియోగం, మిగులు జలాల వాడకంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఇదే విషయాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్​కు  నివేదించే అంశంపైనా చర్చిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర నదీజలాల పంపిణీ, గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు కోసం మూడు ప్రతిపాదనలపై చర్చలు జరుపుతున్నారు. రేపు కూడా సమావేశం జరుగుతుందని తెరాస వర్గాలు తెలిపాయి.
 

2019-06-28 11:42:05

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

చర్చిస్తున్న ప్రధానాంశాలు: 

  1. గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీజలాలపై వివాదాల పరిష్కారం
  2. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై ప్రధాన చర్చ
  3. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు, పంపిణీపై కేసీఆర్‌ దృశ్య రూప ప్రదర్శన
  4. విద్యుత్‌ సంస్థల విభజన, ఉద్యోగుల సర్దుబాటు, విభజన సమయం నాటికి డిస్కంలకు బకాయిల చెల్లింపుల అంశం
  5. పౌరసరఫరాల సంస్థ విభజన, లెవీ నిధుల వినియోగ విషయం. దిల్లీలోని ఏపీ భవన్‌ వ్యవహారం
  6. తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన అంశం

2019-06-28 11:25:21

ప్రగతిభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం జగన్‌

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రగతి భవన్ చేరుకున్నారు. జగన్​తో పాటు ఏపీ మంత్రులు, అధికారులు ఉన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై చర్చించనున్నారు. 

Last Updated : Jun 28, 2019, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details