మేడారం జాతర దిగ్విజయంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా నిర్వహించారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నాయకత్వంలోని అన్ని శాఖల అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు రేయింబవళ్లు పనిచేసి భక్తులకు సేవలు అందిచారని అభినందించారు.
'మేడారం మహాజాతర నిర్వహణ చాలా బాగుంది' - kcr happy on medaram
లక్షలాది మంది భక్తులు పాల్గొన్న మేడారం మహాజాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించారని కేసీఆర్ అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జాతర నిర్వాహకులను సీఎం అభినందించారు.
!['మేడారం మహాజాతర నిర్వహణ చాలా బాగుంది' 'మేడారం మహాజాతర నిర్వహణ చాలా బాగుంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6009191-thumbnail-3x2-kcr.jpg)
'మేడారం మహాజాతర నిర్వహణ చాలా బాగుంది'
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, జాతర నిర్వాహకులు, పూజారాలు, వనదేవతల వారసులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ట్రాఫిక్ సమస్యలు, క్యూలైన్ క్రమబద్ధీకరణలో పోలీసులు సమగ్ర వ్యూహంతో వ్యవహరించారని వ్యాఖ్యానించారు.
'మేడారం మహాజాతర నిర్వహణ చాలా బాగుంది'