ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతుండటం వల్ల వైద్యులు ఇంటి వద్దే పరీక్షించారు. జ్వరం స్వల్పంగా ఎక్కువగా ఉండటం వల్ల గత రాత్రి 9 గంటల ప్రాంతంలో సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పలు పరీక్షలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. పరీక్షల అనంతరం సీఎం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆసుపత్రిలో కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కూతురు కవిత, కుటుంబసభ్యులు ఉన్నారు.
ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు - kcr got sick
సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి తీవ్రత ఎక్కువ కావడం వల్ల సోమాజీగూడాలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పలు పరీక్షలు చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రికి అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు
Last Updated : Jan 22, 2020, 5:46 AM IST
TAGGED:
kcr got sick