సీఎం కేసీఆర్ ముస్లిం, ఎస్సీలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. కేసీఆర్ పౌరసత్వ బిల్లును అమలు చేయనని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహం పెడతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎందుకు పెట్టలేదన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను తీసుకువస్తే రెండు నెలలుగా దానిని పోలీసు స్టేషన్‌లో పెట్టి తనపైనే కేసు పెట్టారని ధ్వజ మెత్తారు.
కేసీఆర్ గారూ.. "పౌర"బిల్లుకు అనుకూలమా..? వ్యతిరేకమా..? - CAA BILL TELANGANA latest updates
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీఎం పౌరసత్వ బిల్లును అమలు చేస్తున్నారా..? లేదా..? సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. అకారణంగా తమపై కేసులు బనాయిస్తే ఏమాత్రం భయపడమని హెచ్చరించారు.

కేసీఆర్.. పౌరసత్వ బిల్లుకు అనుకూలమా..? వ్యతిరేకమా..?
అకారణంగా కేసులు బనాయిస్తే భయపడం:వీహెచ్
అకారణంగా కేసులు బనాయిస్తే ఏమాత్రం భయపడనని వీహెచ్ అన్నారు. భాజపాతో పొత్తు ఉన్న బిహార్ సీఎం నితీష్‌కుమార్ పౌరసత్వ బిల్లును అమలు చేయనని ప్రకటన చేశారని.. కేసీఆర్ చెప్పకపోవడం వెనుక ఆంతర్యం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్.. పౌరసత్వ బిల్లుకు అనుకూలమా..? వ్యతిరేకమా..?