తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు - PRAGATHI BHAVAN

KCR Dasara Puja: ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయ దశమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రగతి భవన్​లోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం కుటుంబసభ్యులతో కలిసి జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు.

KCR Dasara Puja
KCR Dasara Puja

By

Published : Oct 5, 2022, 1:15 PM IST

KCR Dasara Puja: దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్​లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన ముఖ్యమంత్రి పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు.

ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు

అనంతరం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంవో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్​లో కేసీఆర్ ఆయుధ పూజ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details