ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తిన బయలుదేరి వెళ్లారు. దిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై.... ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను...... కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పెండింగ్ సమస్యలను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని కోరనున్నారు.
ప్రధానితో భేటీ..
రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-ఐఐఎం మంజూరుకు సంబందించిన అంశంపై ప్రధానితో చర్చించే అవకాశముంది. విభజన చట్టం పెండింగ్ అంశాలు, రహదార్ల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు...., ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్రాలకు అదనపు నిధులు, కేంద్రం నుంచి రావల్సిన బకాయిలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ తదితర అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్పాలి: మంత్రి సబితా