తెలంగాణ

telangana

ETV Bharat / city

'కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని కేసీఆర్ ప్లాన్' - హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​

HCA ISSUE: కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మాజీ ఎంపీ, హెచ్​సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా తనను పోటీ చేయవద్దని కేసీఆర్ అన్నారని తెలిపారు.

HCA
హెచ్​సీఏ

By

Published : Sep 24, 2022, 5:16 PM IST

HCA ISSUE: కేటీఆర్‌, కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏలో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకట స్వామి ధ్వజమెత్తారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ వద్దని కేసీఆర్ అప్పట్లో చెప్పినట్లు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్న తమకు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఎందుకు అని అన్నారని వెల్లడించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనేదానిపై స్టీరింగ్ కమిటీలో చర్చించామని ఆయన అన్నారు. ఆ కమిటీ సభ్యుల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు. మండల ఇంచార్జీలను కూడా నియమిస్తామని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హెచ్​సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్​పై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై హెచ్​సీఏకు సంబంధం లేదని ఆయన చేతులెత్తేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details