తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ - నరసింహన్​తో కేసీఆర్​ భేటీ

రాజ్​భవన్​లో గవర్నర్​ నరసింహన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, నూతన పురపాలక చట్టం, మున్సిపల్​ ఎన్నికల వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ

By

Published : Jul 18, 2019, 6:01 PM IST

Updated : Jul 18, 2019, 7:22 PM IST

గవర్నర్​తో సీఎం కేసీఆర్​ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్​తో భేటీ అయ్యారు. శాసనసభ వాయిదా పడిన వెంటనే నేరుగా రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం.. గవర్నర్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, మున్సిపల్​ ఎన్నికలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీటి వివరాలను గవర్నర్​కు కేసీఆర్​ వివరించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన పురోగతిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక గవర్నర్​ను నియమించిన తర్వాత నరసింహన్​ను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి.

Last Updated : Jul 18, 2019, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details