MLC Kavitha today tweet: తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం గవర్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తెరాస పార్టీ ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో ధీటుగా బదులిచ్చారు.
గవర్నర్ రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా చూస్తున్నారు: కవిత ట్వీట్ - రాజ్‌భవన్
MLC Kavitha today tweet: గవర్నర్ తమిళసై ఇవాళ రాజ్‌భవన్‌లో చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ట్విటర్ వేదికగా తన గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు. గవర్నర్ రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత ట్వీట్
గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి పాలు చేయాలని తమిళిసై భావిస్తున్నారని కవిత విమర్శించారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలు పొందుదామని భాజపా చూస్తోందని.. గవర్నర్ ద్వారా ఇలాంటి ప్రకటనలు చేయిస్తోందని విరుచుకుపడ్డారు.
ఇవీ చదవండి: