37 ఏళ్ల కెటీ డొనేగన్ పొదుపు గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ ఉద్యోగంలో ఒక స్థాయికి చేరే వయసులో తను రిటైరవ్వడమే కాదు... రూ.10 కోట్లు పొదుపు చేసి(creative ways to save money) వార్తల్లోకెక్కింది. అదెలా సాధ్యమైందో కూడా సామాజిక మాధ్యమాల్లో(social media) చెబుతోంది. ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్న కెటీ పొదుపు రహస్యాలను(creative ways to save money) తెలుసుకుందాం.
చదువుకునేటప్పుడు అమ్మానాన్న ఇచ్చిన పాకెట్ మనీని తోబుట్టువుల్లా కెటీ ఖర్చు పెట్టేది కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి పైసాను పొదుపు చేసేది. అలా దాచిన నగదుతో ఏదైనా చిన్నవ్యాపారం మొదలు పెట్టాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచించేది. అదే ఆమెను కోస్టారికాకు వెళ్లేలా చేసింది. అక్కడ తన జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటనే అలాన్‌ని కలవడం అంటుంది కెటీ.
‘అనుకోకుండా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారి జీవితాన్ని పంచుకునేలా చేసింది. పొదుపులో మా ఆలోచనలు ఒకటిగా ఉండటమే దీనికి కారణం. అలా ఒంటరిగా వెళ్లి జంటగా లండన్‌కు 2013లో తిరిగొచ్చా. ఆ తర్వాత లండన్ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసి, ఓ జీవితబీమా సంస్థలో ఏడాదికి రూ.28 లక్షల జీతానికి చేరా. అలాన్ సొంత వ్యాపారం చేసేవాడు. సొంత ఇల్లు కోసం నగదు కూడబెట్టడం మొదలు పెట్టాం. దీనికోసం ఇద్దరం చాలా పొదుపుగా ఉండేవాళ్లం. ప్యాక్డ్ లంచ్ తినేవాళ్లం. ఎక్కువ ఖర్చయ్యే రాత్రి పార్టీలకు స్వస్తి పలికాం.'