Red Okra Cultivation: రోజువారీగా మనం వినియోగించే కూరగాయల్లో అందరికీ అందుబాటులో ఉండి, ఆరోగ్యాన్ని అందించే వాటిలో బెండ ముఖ్యమైనది. బెండలో ఉండే ఫోలిక్ ఆసిడ్ మనోవికాసానికీ, పీచు పదార్థం, ఇతర పోషకాలు సాధారణంగా వచ్చే గుండెజబ్బులు, మధుమేహం, మలబద్దకం, స్థూలకాయం వంటి వ్యాధుల నియంత్రణలో సమర్థంగా తోడ్పడుతాయి. పచ్చరంగులో ఉండే బెండ రకాలే సాగులో ఉన్నాయి. కొన్ని తెలుపు రకాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.
Red Okra Cultivation: ఎర్రబెండలో మెండుగా పోషకాలు - బెండ సాగు
Red Okra Cultivation: మనం నిత్యం వినియోగించే కూరగాయల్లో అందరికీ అందుబాటులో ఉండి, ఆరోగ్యాన్ని అందించే వాటిలో బెండ ముఖ్యమైనది. ఎక్కువగా పచ్చరంగులో ఉండే బెండ రకాలే సాగులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెలుపు రకం బెండకాయలను సాగు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా మన దేశంలో ఎరుపు రంగు బెండ రకాన్ని సాగుచేస్తున్నారు. దీనిలో మిగతావాటికంటే పోషకాలు అధికమొత్తంలో ఉన్నాయి. అయితే దీని సాగుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఇది చదవాల్సిందే.
Kashilalima red coriander
పచ్చ, తెలుపురంగు బెండ రకాలకు అదనంగా ఈ మధ్యకాలంలో ‘కాశీలాలిమ’ అనే ఎరుపు బెండ రకాన్ని మన దేశంలో విడుదల చేశారు. ఈ రకంలో కాయరంగు ఎరుపుగా ఉండేందుకు ‘ఆంథోసైనిన్’ అనే పిగ్మెంట్ కారణం. కాయరంగుకి కారణమైన ఈ పిగ్మెంట్ యాంటి-యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఆంథోసైనిన్‌తో పాటు, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు కూడా ఈ బెండలో సాధారణ బెండ కంటే అధికంగా ఉంటాయి.
ఇదీ చదవండి:జన్యుకూర్పు విత్తనాలు మొక్కల వినియోగానికి గ్రీన్‌సిగ్నల్