ఆంధ్రప్రేదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్. మునికుమారి అనే మహిళ వినూత్నంగా తన శివభక్తిని చాటారు. మూడేళ్లలో ఏకంగా కోటి వొత్తులు తయారుచేశారు. కార్తిక మాసంలో కోటి వత్తులు వెలిగించాలని మూడేళ్ల క్రితం సంకల్పించారు.
కోటి వత్తులతో పరమేశ్వరునికి మహా హారతి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
శివ భక్తురాలైన ఎస్.మునికుమారి అనే మహిళ మూడేళ్లు కష్టపడి కోటి వత్తులను తయారు చేశారు. నిన్నకార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా ఆలయంలో ఆ కోటి వత్తులతో శివునికి మహా హారతి ఇచ్చారు.
![కోటి వత్తులతో పరమేశ్వరునికి మహా హారతి కోటి వత్తులతో పరమేశ్వరునికి మహా హారతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9565302-200-9565302-1605584393748.jpg)
కోటి వత్తులతో పరమేశ్వరునికి మహా హారతి
అప్పటి నుంచి ఇంట్లో పనులు ముగియగానే వొత్తుల తయారు చేశారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీకాశీవిశ్వేర స్వామి ఆలయంలో 200 పెద్ద ప్రమిదల్లో కోటి ఒత్తులతో శివుడికి మహా హారతి ఇచ్చారు. అనంతరం భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.