తెలంగాణ

telangana

ETV Bharat / city

'నిన్నటి అద్భుతం.. నేడు అబద్ధమైపోయిందా?:' - karne prabhakar

గతంలో తెరాస పాలనను మెచ్చుకున్న కేంద్ర మంత్రులే అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్​ కర్నె ప్రభాకర్​ మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.

'భాజపా నేతలు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు'

By

Published : Sep 24, 2019, 5:19 PM IST

'భాజపా నేతలు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు'

కేంద్రమంత్రులు ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్ తిప్పికొట్టారు. తెరాస పాలనను మెచ్చుకున్న ఆ కేంద్రమంత్రులు ఇప్పుడు కావాలనే అబద్ధాలతో విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. మోసపూరితంగా వాగ్దానాలు చేసి గెలిచిన భాజపా నేతలు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజా దీవెనలు ఉన్న కేసీఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాష్ట్రంలో దిక్కులేకున్నా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో గెలిస్తే పసుపుబోర్డు అన్నారని... అది ఏమైందో ప్రజలకు కేంద్ర మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెరాసను ఎదుర్కోవాలని అప్పుడు ఎవరేమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details