కర్ణాటక రాజకీయ ప్రకంపనలకు కారణమైన 17 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ రమేష్ కుమార్ ఇవాళే రాజీనామా చేశారు. అనంతరం మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు మాట్లాడారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తానేమి గొప్ప పని చేయలేదని చెప్పిన రమేష్ కుమార్ యువతరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ పని చేసినట్లు తెలిపారు.
'యువతరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ పని..' - undefined
కర్ణాటక అస్మమతి ఎమ్మెల్యేల వేటు అంశం తన కర్తవ్యంలో భాగంగానే చేశాన్నారు మాజీ స్పీకర్ రమేష్ కుమార్. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్న ఆయన తనకు జైపాల్ రెడ్డితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
'యువతరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ పని..'
దివంగత జైపాల్ రెడ్డి తనకు సోదరునితో సమానమన్నారు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్. తమకు 35 ఏళ్ల బంధం ఉందన్న ఆయన... జైపాల్ రెడ్డి తనకు మెంటర్ అన్నారు. రాజకీయాలపరంగానే కాకుండా వ్యక్తిగంతగానూ ఎన్నో సలహాలను ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి ఆదర్శాల కోసం నిలిచిన గొప్ప వ్యక్తి అని తెలిపారు.
ఇవీ చూడండి: కర్ణాటక సభాపతి రమేశ్ కుమార్ రాజీనామా