హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపొందిన సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ ఎస్‌ఆర్ఆర్ కాలేజీ వద్ద నుంచి ర్యాలీగా కోర్టు వైపు వస్తుండగా పోలీసులు నిలువరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేస్తున్నారంటూ.. వాహనాలకు అడ్డంగా సీపీ సత్యనారాయణతో పాటు పోలీసులు నిలబడ్డారు.
Etela Rajender: ఈటల విజయోత్సవ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలు
హుజూరాబాద్‌లో విజయం అనంతరం కరీంనగర్‌లో బండి సంజయ్, డీకే అరుణతో కలిసి ఈటల ర్యాలీగా కోర్టు వైపునకు బయలుదేశారు. వారి వాహనాలను అడ్డుకున్న సీపీ సత్యనారాయణ ర్యాలీ చేసేందుకు ఈసీ నిబంధనలు అంగీకరించవని చెప్పారు.
దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసుల చర్యలతో భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ర్యాలీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్.. తాము కోర్టు కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వస్తామంటీ సీపీని కోరారు. పూలమాల వేయడానికి అభ్యంతరం లేదని.. ర్యాలీ తీయడమే నిబంధనలకు విరుద్ధమని సీపీ పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించకుండా వెళ్లాలని సూచించారు.
ఇదీచూడండి:హుజూరాబాద్‌లో ఈటల ఘన విజయం.. 23,855 ఓట్ల మెజార్టీతో గెలుపుబావుటా..