తెలంగాణ

telangana

ETV Bharat / city

200 మంది పేదలకు నిత్యావసరాలు అందించిన ఫినోలెక్స్​ సంస్థ - నిత్యావసరాలు పంపిణీ చేసిన మేయర్​ సునిల్​రావు

కరీంనగర్​లోని సీతారాంపూర్​లోని 200 మందికి ఫినోలెక్స్​ సంస్థ నిత్యావసర సరుకులు అందజేశింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్​ సునీల్​ రావు పేదలకు 1400 రూపాయల విలువైన సరుకులను పంపిణీ చేశారు. ఫినోలెక్స్​ యాజమన్యాన్ని సునిల్​రావు అభినందించారు.

200 మంది పేదలకు నిత్యావసరాలు అందించిన ఫినోలెక్స్​ సంస్థ
200 మంది పేదలకు నిత్యావసరాలు అందించిన ఫినోలెక్స్​ సంస్థ

By

Published : Nov 8, 2020, 10:57 AM IST

కరీంనగర్​లోని సీతారాంపూర్​లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో ఫినోలెక్స్ సంస్థ పేద ప్రజలకు దీపావళి సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు పాల్గొన్నారు. ఫినోలెక్స్ సంస్థ అందిస్తున్న రూ.1400 విలువ చేసే నిత్యవసర సరుకులను 200 మందికి పంపిణీ చేసారు.

కొవిడ్ సమయంలో ప్రజలకు సేవలందించిన మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు కార్పొరేటర్లను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. కొవిడ్​ వేళ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫినోలెక్స్ సంస్థ వారు 30 వేల మంది పేదలకు నిత్యవసర సరుకులు అందించడం అభినందనీయమని మేయర్​ కొనియాడారు. సేవా భావంతో ముందుకొచ్చిన ఫినోలెక్స్ సంస్థ యజమాన్యానికి... వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: స్పందించిన మానవత్వం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ

ABOUT THE AUTHOR

...view details