కార్గిల్ విజయ్ దివస్‌ను హిమాచల్‌ప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నాగ రెజిమెంట్‌లోని సైనికులను గవర్నర్ బండారు దత్తాత్రేయ జ్ఞాపికలతో సన్మానించారు. ఆనాటి యుద్ధ అనుభవాలను వారు గవర్నర్ దత్తాత్రేయతో పంచుకున్నారు. ఎముకలు కొరికే చలిలో, అత్యంత క్లిష్టమైన కొండ చరియల్లో సాగించిన విజయయాత్ర గురించి వారు వివరించారు. సైనికులు చేసిన సాహసాలను తెలుసుకున్న గవర్నర్ ఒకింత ఆశ్చర్యంలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కార్గిల్ విజయ్ దివస్‌ను హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బండారు దత్తాత్రేయ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం పట్ల బండారు దత్తాత్రేయ సైనికులను అభినందించారు.
హిమాచల్ ప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్