తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎం జగన్​కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ - కన్నా లేటెస్ట్ న్యూస్

ఏపీ సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు లేఖలు రాశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కన్నా కోరారు. దయనీయస్థితిలో ఉన్న చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. మరో లేఖలో వార్తల సేకరణలో పాత్రికేయులు సైతం కరోనా బారిన పడుతున్నారని కన్నా తెలిపారు. హరియాణా మాదిరి జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని సీఎం జగన్​ను కన్నా కోరారు.

KANNA WRITE A LETTER TO CM JAGAN
ఏపీ సీఎం జగన్​కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

By

Published : Apr 26, 2020, 8:34 PM IST

ఏపీ సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు లేఖలు రాశారు. లాక్‌డౌన్‌తో తయారీ, సేవారంగం, వ్యాపారసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయాయన్నారు. చిరు వ్యాపారస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారన్న కన్నా.. దయనీయ స్థితిలో ఉన్నవారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. సాధారణ స్థితి వచ్చేవరకు విద్యుత్ బిల్లులను వాయిదా వేయాలని కోరారు. చిరు వ్యాపారస్తులకు 3 నెలలపాటు బిల్లులు మినహాయింపు ఇవ్వాలన్నారు. అప్పుడే వాళ్లు ఆర్థిక సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉందని కన్నా అన్నారు.

జర్నలిస్టులకు బీమా

కరోనా వేళ పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ రాసిన రెండో లేఖలో కన్నా తెలిపారు. కరోనా దృష్ట్యా విలేకరులకు హరియాణా రూ.10 లక్షలు బీమా కల్పించిందని గుర్తుచేశారు. ఏపీలోనూ కొందరు జర్నలిస్టులు వార్తాసేకరణలో కరోనా బారినపడ్డారన్నారు. పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్న కన్నా.. జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని లేఖలో కన్నా కోరారు.

ఇవీ చూడండిి:కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ABOUT THE AUTHOR

...view details