వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ట్వీట్ల పోరు నడుస్తోంది. తెదేపాకు దూరంగా ఉండాలని అధిష్టానం చెబుతున్నా కన్నా పట్టించుకోవటం లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమరావతి విషయంలో అందుకే గవర్నర్ కు లేఖ రాశారా అని ప్రశ్నించారు.
దానికి కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్లో ఘాటుగా బదులిచ్చారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్ 'పేరుతో వైకాపా నేతలు పుస్తకం విడుదల చేశారు కదా... మీరు అధికారం చేపట్టిన తర్వాత వారి అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కన్నా ప్రశ్నించారు.