విజయవాడలో కనకదుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల నదిలో జలవిహారం లేకుండానే తెప్పోత్సవం చేశారు. హంస వాహనంపై ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. హంస వాహనంపైకి విడతల వారీగా మొత్తం 80 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. పూజా కార్యక్రమాలు చూసేందుకు ప్రకాశం బ్యారేజ్ నుంచి మాత్రమే అనుమతించారు. దుర్గాఘాట్, పున్నమిఘాట్, పైవంతెన నుంచి వీక్షించేందుకు అనుమతి నిరాకరించారు.
ఘనంగా బెజవాడ దుర్గమ్మకు తెప్పోత్సవం - కృష్ణానదిలో హంసవాహనంపై దుర్గమ్మ ఊరేగింపు
బెజవాడ దుర్గమ్మకు ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో.. నదిలో జలవిహారం లేకుండానే తెప్పోత్సవం జరిగింది. హంసవాహనంపై ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా దుర్గమ్మకు తెప్పోత్సవం