తెలంగాణ

telangana

ETV Bharat / city

Kamineni Hospitals: 'కొవిడ్ కాలంలో ఆర్థిక సవాళ్లను అధిగమించేలా కేంద్ర బడ్జెట్ ఉంది'

Kamineni Hospitals About Budget: 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, మెంటల్ హెల్త్ అండ్​ వెల్​బీయింగ్​తో సహా ఆరోగ్యం వంటి అన్ని రంగాలపై ఆర్థికమంత్రి దృష్టి సారించడం హర్షణీయమన్నారు.

By

Published : Feb 1, 2022, 8:03 PM IST

Kamineni Hospitals About Budget
కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి

Kamineni Hospitals About Budget: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్​ను స్వాగతిస్తున్నామని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని తెలిపారు. దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం, అన్ని వాటాదారులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు.

'2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం, అన్ని వాటాదారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొవిడ్ కాలంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కేంద్ర బడ్జెట్ ప్రగతిశీలమైనది. డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, మెంటల్ హెల్త్ అండ్ వెల్‌బీయింగ్‌తో సహా ఆరోగ్యం వంటి రంగాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి సారించడం హర్షణీయం. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ గురించి ఆర్థికమంత్రి చేసిన ప్రకటన ప్రశంసనీయం.'

-డాక్టర్ గాయత్రి, కామినేని ఆస్పత్రుల సీవోవో

దేశ ప్రజలకు నాణ్యమైన, డిమాండ్‌కు తగిన ఆరోగ్య సంరక్షణను అందించడంలో బడ్జెట్ చాలా దోహదపడుతుందని గాయత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

ABOUT THE AUTHOR

...view details