తెలంగాణ

telangana

ETV Bharat / city

I-Telugudesam : కంభంపాటి రామ్మోహన్‌రావు ‘నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణ - tdp latest news

I-Telugudesam : ప్రజల అభిమానంతో అధికారంలోకి వచ్చి ఆ అధికారం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తెలుగుదేశం సిద్ధాంతమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ల అనుభవాలపై కంభంపాటి రామ్మోహన్ రచించిన ‘నేను-తెలుగుదేశం' పుస్తకాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగుదేశం సీనియర్ నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై..తమ అనుభవాల్ని పంచుకున్నారు.

Telugudesam
Telugudesam

By

Published : Mar 29, 2022, 5:41 AM IST

I-Telugudesam : తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ తొలితరం నేత.. కంభంపాటి రామ్మోహన్ రావు.... తెలుగుదేశంలో తన 40 ఏళ్ల అనుభవాలపై 'నేను -తెలుగుదేశం' పుస్తకాన్ని రచించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో.... పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిలుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్​తో ఉన్న అనుబంధాన్ని బండారు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ప్రజలే దేవుళ్లుగా భావించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అధికారంలో ఉండాలని కాకుండా... ప్రజాహితం కోసమే తెలుగుదేశం పనిచేసిందని చంద్రబాబు తెలిపారు.

ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధం చాలా గొప్పదని పుస్తక రచయిత కంభంపాటి రామ్మోహన్‌రావు వెల్లడించారు. ప్రారంభం నుంిచి పార్టీలో ఉండి కార్యకర్తగా మెుదలుకుని అనేక పదవుల్లో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ప్రాంతీయ పార్టీ అయినా.... జాతీయ భావాలతో కొనసాగటం తెదేపాకే సాధ్యమన్నారు. నేటి తరానికి తెలుగుదేశం గురించి తెలియాలనే పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు.

కాంగ్రెస్ పట్ల ప్రజలు విముఖత చూపుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసి ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారని సీపీఐ నారాయణ...నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. అధికారం ఉన్న లేకున్నా.. వ్యవస్థ నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు. తెదేపా, ఎన్టీఆర్ కీర్తిని నేటి తరానికి చూపేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. చంద్రబాబుని మళ్లీ సీఎంగా చూడాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. నేను-తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణకు వచ్చిన పలువురు నేతలు పార్టీతో, ఎన్టీఆర్‌తో తమకు అనుబంధాన్ని పంచుకున్నారు.

I-Telugudesam : కంభంపాటి రామ్మోహన్‌రావు ‘నేను-తెలుగుదేశం' పుస్తకావిష్కరణ

ఇదీచూడండి:కాంగ్రెస్​ బలంగా మారాలని కోరుకుంటున్నా.. : కేంద్ర మంత్రి గడ్కరీ

ABOUT THE AUTHOR

...view details