తెలంగాణ

telangana

ETV Bharat / city

ముమ్మరంగా సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు - కాళేశ్వరం ఎత్తిపోతలు

కాళేశ్వరం ఎత్తపోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 51గంటల్లోనే లక్ష్మీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి 2.75టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇప్పటివరకు 31 పంపులు నడుస్తుండగా.. వీటిని 37కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యమానేరుకు 12టీఎంసీల నీటిని తరలింపే లక్ష్యంగా ఎత్తిపోతలు సాగుతున్నాయి.

kaleshwaram-project-uplifts-are-in-full-swing
ముమ్మరంగా సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు

By

Published : Aug 7, 2020, 5:01 AM IST

Updated : Aug 7, 2020, 6:22 AM IST

ముమ్మరంగా సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు

తరలిపోతున్న గోదావరిని తలాపునకు ఎత్తిపోస్తున్నాయి కాళేశ్వరం పంపులు. ప్రాణహిత సంగమం అనంతరం లక్ష్మీ బ్యారేజి నుంచి గోదావరి ఒక్కో అడుగు వెనక్కు వేస్తోంది. లక్ష్మీ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతున్న కొద్దీ వెనుక జలాలు విస్తరిస్తున్నాయి. గోదావరి తీరమంతా చల్లని తెమ్మెరలతో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంటోంది. తీరాన్ని ఆనుకుని ఉన్న ఊళ్లల్లో భూగర్భజలం పైకి రానుంది. మహారాష్ట్ర నుంచి దిగువకు వరద వచ్చే లోపే నది పొడవునా ప్రవాహం ఎగువకు విస్తరిస్తోంది.

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఈ నెల 4 న 3 గంటలకు ఎత్తిపోత ప్రారంభమైంది. 6వ తేదీ 6 గంటల వరకు అంటే 51 గంటల్లో లక్ష్మీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి జలాశయానికి 2.75 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి మధ్యమానేరుకు 2టీఎంసీల నీటిని తరలించారు. లక్ష్మీ పంపుహౌజ్‌ నుంచి 10 పంపులు, సరస్వతి పంపుహౌజ్‌లో 6, పార్వతీ పంపుహౌజ్‌లో 7, నంది, గాయత్రి పంపుహౌజ్‌ల్లో నాలుగేసి పంపులు నడిపిస్తున్నారు. ఇప్పటివరకు 31 పంపులు నడుస్తుండగా... వీటిని 37కు పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యమానేరు జలాశయంలో 5టీఎంసీల నీరుండగా... దానిని 17 టీఎంసీలకు పెంచాలని భావిస్తున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల జలాశయాల్లో నీటి వివరాలు

జలాశయం

పూర్తిస్థాయి సామర్థ్యం

(టీఎంసీల్లో)

ప్రస్తుత నీటి నిల్వ

(టీఎంసీల్లో)

ఎత్తిపోతలతో వస్తున్న ఇన్​ఫ్లో

(క్యూసెక్కులు)

లక్ష్మీ(మేడిగడ్డ) 16.17 12.00 -- సరస్వతి(అన్నారం) 10.87 8.34 22,000 పార్వతి(సుందిళ్ల) 8.83 5.86 17,400 ఎల్లంపల్లి 20.17 8.15 16,679 మేడారం 0.07 0.06 -- మధ్యమానేరు 25.87 5.83 10,058

ఇవీ చూడండి: నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Last Updated : Aug 7, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details